నంద్యాల,శివసూర్య,జూన్ 19:
*మిడుతూరు మండలం రోళ్లపాడు మలుపు వద్ద గురువారం ఉదయం 5-30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయపు ఆఫీస్ సబార్డినేట్ బి. నాగరాజు హఠాన్మరణం చెందారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేసారు.

