ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీరెల్లలపాలెం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చిన్నారుల నిరసన

రెల్లలపాలెం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చిన్నారుల నిరసన

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల చీడికాడ మండలంలో కోనాం పంచాయితీలో రెల్లలపాలెం గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని పవన్ కళ్యాణ్ మామయ్య మా గ్రామానికి రోడ్డు వెయాలి చంద్రబాబు తాతయ్య మా గ్రామానికి రోడ్డు వేయాలని అంటూ గిరిజన చిన్నారులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం రెల్లలపాలెం గిరిజన చిన్నారులకు గ్రామ ప్రజలకు మద్దతుగా ఆదివాసి గిరిజన సంఘం ఐదోవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట. నరసింహమూర్తి మాట్లాడుతూ చీడికాడ మండలంలో కోనాం పంచాయతీలో గిరిజన గ్రామ మైన రెల్లలపాలెం గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, గిరిజన చిన్నారులు గ్రామ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారుని ఈ విషయంపై జనవరి 20న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసామని తర్వాత సర్వే కోసం అధికారులు వచ్చి రోడ్డు సెంక్షన్ కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలియజేశారని అన్నారు. రోడ్డు సదుపాయం లేక పోవడంతో చిన్న పిల్లలు అంగన్వాడి సెంటర్ కు దూరం అయ్యారనీ, స్కూలుకి వెళ్లడానికి విద్యకు దూరం అయ్యారన్నారు. ఆరోగ్యాలు బాగోలేకపోతే డోలి కట్టుకొని పది కిలోమీటర్లు డోలిమోతతో కాళినడకన వైద్యానికి వెళ్ళవలసి వస్తుందన్నారు. నిత్యవసర వస్తువులు తీసుకురావడానికి దేవరపల్లి 25 కిలోమీటర్లు కోణం 10 కిలోమీటర్లు సంతలకు వెళ్లి భుజాలపై తలపై నిత్యవసర వస్తువులు మూసుకొని రావాల్సి వస్తుంది అని అన్నారు . పవన్ కళ్యాణ్ చంద్రబాబు జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే రెల్లలపాలెం గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని నరసింహమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో ఇరట ఈశ్వరమ్మ, కోట గంగమ్మ, దాయిరి దేముడమ్మ‌, కోట మల్లమ్మ, సోమల సూర్యనారయణ, చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!