ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీయూబిఐ సీనియర్ మేనేజర్ నాగరాజు కు ఘనంగా వీడ్కోలు

యూబిఐ సీనియర్ మేనేజర్ నాగరాజు కు ఘనంగా వీడ్కోలు

📰 Generate e-Paper Clip

అగనంపూడి : జయజయహే : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో బి నాగరాజు కి ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మరియు ఖాతాదారులు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. అనంతరం బ్యాంక్ సీనియర్ మేనేజర్ బి నాగరాజు మాట్లాడుతూ అగనంపూడి బ్యాంక్ శాఖలో విధి నిర్వహణలో నిర్వహించడం నాకు చాలా సంతోషం ఇచ్చిందని నేను గతంలో ఇదే బ్యాంకులో క్యాషియర్ గా పనిచేసి ప్రమోషన్ పై వేరే ప్రాంతంలోకి వెళ్లి పనిచేసి మళ్లీ నేను ఇక్కడికి సీనియర్ మేనేజర్ గా వచ్చానని ఇప్పుడు విజయనగరం రీజన్ల బదిలీ అయ్యానని అన్నారు. ఈ బ్రాంచ్ లో ఖాతాదారులు, సహస్ర ఉద్యోగులు నా విధి నిర్వహణలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు. బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించారని. అగనంపూడి ఏరియాలో ఎక్కడ ఆధార్ సెంటర్ లేక స్థానిక ప్రజలు గాజువాక వడ్డపూడి వెళ్లి ఆధార్ కార్డు చేపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో బి నాగరాజు ఎంతో చొరవ తీసుకొని బ్యాంకు ఉన్నత అధికారులతో మాట్లాడి అగనంపూడి బ్యాంకులో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడంలో స్థానిక ప్రజలు దగ్గర ఎన్నో ప్రశంసలు పొందతిరి అని అన్నారు. స్థానిక ప్రజా సంఘ నాయకులు కసిపల్లి శ్రీనివాసరావు, సింగుడు సింహాచలం, బండారు చందు రమేష్ ,ఈగల తాతారావు ,చంటి బ్యాంకు సిబ్బంది కె ములరాజు, డి రామకృష్ణ ,ఎం శ్రీనివాసరావు ,కే జానకి ,డి అనిత, ఏ సత్యవతి, డివివి ప్రసాద్ ,బి రాజు ఆర్పీలు శ్రీదేవి స్రవంతి, జలావతి, లలిత, పార్వతి, కృష్ణవేణి ,అరుణ, గోవిందమ్మ మరియు ఖాతాదారులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!