Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమెట్రో సిటీని పొడిగించాలి గండి బాబ్జికి వినతి పత్రం అందజేసిన టిడిపి నాయకులు

మెట్రో సిటీని పొడిగించాలి గండి బాబ్జికి వినతి పత్రం అందజేసిన టిడిపి నాయకులు

జయజయహే : విశాఖ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జిని 85 వార్డు టిడిపి సీనియర్ నాయకులు బలరెడ్డి సత్యనారాయణ, ఎదురు గౌరీ నాయుడు, బండారు చందు రమేష్ మరియు స్టార్ డం పాఠశాల డైరెక్టర్ శంబంగీ రంగారావు, గండి బాబ్జిని మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం స్థానిక సమస్యలైన సిటీ నుండి ఫార్మాసిటీ కంపెనీలకు రోజుకి 25వేల మంది ఉద్యోగులు 2 వందల ట్రావెల్స్ మీద వస్తున్నారు, టాటా హోమి బాబా క్యాన్సర్ ఆసుపత్రికి వివిధ రాష్ట్రాల నుండి పేషెంట్లు సిటీకి వస్తున్నారు కావున వారందరూ సౌలభ్యం కొరకు మెట్రో సిటీని కూర్మన్నపాలెం వరకే ప్రతిపాదన చేశారని కావున లంకెలపాలెం వరకు పొడిగించాలని, ఫార్మా కంపెనీ నిర్వాసితులు గాజువాక నియోజకవర్గం లో పునరావాసం ఇచ్చారు కంపెనీలు పెందుర్తి నియోజకవర్గంలో ఫార్మా నివాసులు గాజువాక నియోజకవర్గం లో ఉండుట వల్ల వీరి సమస్యలు ఫార్మా కంపెనీల్లో టాటా హోమి బాబా క్యాన్సర్ ఆస్పత్రిలో ఉపాధి కల్పన విషయములో ఎవరు సరైన బాధ్యత తీసుకోవడం లేదని కావున తమరు గాజువాక, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలెక్టర్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి ఫార్మ కంపెనీలు,హోమి బాబా క్యాన్సర్ ఆస్పత్ర యాజమాన్యాన్ని కూర్చోబెట్టి ఫార్మా కంపెనీల నిర్వాసితుల కు ఉపాధి కల్పనకు మరియు కాలనీ డెవలప్మెంట్ కి తమ చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేయడం జరిగినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?