ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీహోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,

📰 Generate e-Paper Clip

అనకాపల్లి, జయజయహే : అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన హోంగార్డు అర్లబు నారాయణ, పాడేరు సబ్ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో, అతని భార్య అర్లబు పార్వతమ్మ కు అల్లూరి సీతారామరాజు మరియు అనకాపల్లి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా అందించిన ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ సహా ఇతర ఆర్థిక సహాయాన్ని కలిపి మొత్తం రూ.4,26,385/- నగదు చెక్కును అందజేశారు. ఈ చెక్కును అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తన కార్యాలయంలో అర్లబు పార్వతమ్మ కు అధికారికంగా అందించారు. హోంగార్డులు విధి నిర్వహణలో మృతి చెందిన లేదా పదవీ విరమణ పొందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డులంతా తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించే మంచి ఆచారం పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఏవోఏ.రామ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ టి.రమేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!