ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeరాజకీయం2027 లో పాదయాత్ర 2.0 చేస్తా …జగన్

2027 లో పాదయాత్ర 2.0 చేస్తా …జగన్

📰 Generate e-Paper Clip

జయజయహే: పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి పాలన పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించి వివరించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం గురించి స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్మాణం పూర్తి చేస్తూనే ఇక.. జనంలోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేస్తామని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. 2029 లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తూ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డు తున్నార‌ని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీ యాలు చేయలేమ‌న్నారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టామని వివరించారు. 2027 నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని ప్రకటించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలన్నారు. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని జగన్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!