ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి

ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి

📰 Generate e-Paper Clip

మన ఆరోగ్యం మన చేతల్లోనే

మా ఇంట్లో ప్రకృతి ఆధారంగా పంటలు పండిస్తున్నాం

మిద్దె తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి

బొలిశెట్టి సత్యన్నారాయణ, జాతీయ అధ్యక్షులు, జలబీరాద్రి.

జయజయహే : ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి అని జలబీరాద్రి సంస్థ జాతీయ అధ్యక్షులు బొలిశెట్టి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. మురళీ నగర్ లోని మినియేచర్స్ ఎక్స్పర్ట్ రమాదేవి ఇంటి వద్ద ఉన్న మిద్దె తోట, ఆమె వ్యర్ధాల నుంచి తయారు చేసిన అద్భుతమైన బొమ్మలు, చిన్న చిన్న కళాఖండాలు చూసి అబ్బుర పరిచే విధంగా ఉన్నాయి అన్నారు. మిద్దె మీద పూసిన కలువలు, కూరగాయలు ఆకుకూరలు పండ్లు అద్భుతంగా ఉన్నాయి అన్నారు. మన ఆరోగ్యం మన చేతల్లోనే ఉంది అన్నాను. తమ ఇంట్లో కూడా ప్రకృతి ఆధారంగా పంటలు చాలా కాలం గా పండిస్తున్నాం అని విరించారు. మిద్దె తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని అక్కడకు వచ్చిన మహిళలు అందర్నీ ఆయన కోరారు. మిద్దె తోటల నగరంగా విశాఖపట్నాన్ని తీర్చి దిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన వనమాలి, సిటిజి సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనమాలి, సిటిజి అడ్మిన్ లు మళ్ళ సరిత, అరవల అరుణ, నగరం లోని 14 ప్రాంతాలకు చెందిన ఏరియా ఇంచార్జీలూ పాల్గొని మాట్లాడారు.

                             

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!