ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపొట్టిదొరపాలెం శివార్లలో గుర్రపు గెడ్డపై వంతెన నిర్మాణo చేపట్టాలి.

పొట్టిదొరపాలెం శివార్లలో గుర్రపు గెడ్డపై వంతెన నిర్మాణo చేపట్టాలి.

📰 Generate e-Paper Clip

చోడవరం: జయజయహే : చోడవరం నియోజవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం శివారు గుర్రపు గడ్డపై వంతెన నిర్మించాలని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పి వి ఎస్ ఎన్ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అయినా స్థానిక రైతులతో మహిళలతో కలిసి గుర్రపు గడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గల సుమారు 800 ఎకరాల భూమికి సంబంధించి రైతులు, వ్యవసాయ కూలీలు నిరంతరం గుర్రం గెడ్డ ను దాటి వారి వ్యవసాయ భూములకు పనుల నిమిత్తము వెళ్లి రావడం జరుగుతుందన్నారు. ఈ గడ్డలో ఏడాది పొడవునా ఉదృతమైన ప్రవాహంతో నీరు ప్రవహించడం వల్ల ఆ గెడ్డను దాటి వ్యవసాయ పనులు చేసుకోవడం అనేది వారికి అత్యంత కష్టసాధ్యంగా ఉందన్నారు. దశాబ్దాలు తరబడి ఎన్నో వ్యయప్రయాసులకు గురవుతూ పలు సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చోడవరం ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు,పార్టీ నాయకులు, రైతులు,మహిళలు తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, రైతులు మాట్లాడుతూ తాము ఈ గెడ్డ వలన ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం అని , చాలా కాలం నుండి ఈ గడ్డను పై వంతెను నిర్మిస్తామన్న నాయకుల హామీ రాజకీయ హామీగానే మిగిలిపోతూ వస్తుందని తమకు ఈ గెడ్డపై వంతెన నిర్మించి న్యాయం చేయాలని ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఈ నిర్మాణం చేస్తే తమ అందరి భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని వ్యవసాయ పని చేసుకోవడం తమకు సులువు అవుతుందని తెలియజేశారు. ఒక మహిళ మాట్లాడుతూ తమ బంధువైన ఓక మహిళ ఈ గెడ్డ ప్రవాహం అధికoగా ఉన్నప్పుడు ప్రవాహంలో పడి చనిపోయిందని ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారని ఆ కుటుంబం అంతా అనాధలయ్యారని చెప్పడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ సమస్య పై స్పందించిన రాజు అక్కడ ఉన్న రైతులు మహిళలతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ గెడ్డపై వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను స్థానిక శాసనసభ్యులు,ఎంపీ గార్ల ద్వారా ప్రభుత్వానికి పంపించి శాంక్షన్ చేయించి నిర్మాణం చేయించడానికి జనసేన పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ కష్టాన్ని అర్థం చేసుకున్నామని ఇక్కడ వంతెన నిర్మాణం చాలా అత్యవసరమని , అక్కడి నుంచే నేరుగా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ పరిస్థితిపై పూర్తి పరిశీలన చేసి అవసరమైన నివేదికను ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరడమైనది. ఈ సందర్భంలో అక్కడ ఉపాధి హామీ పనుల్లో ఉన్న శ్రామికులను కలిసి వారితో పలు విషయాలను చర్చించడం జరిగింది వారు తమకి ఎదురవుతున్న ఇబ్బందులను, కష్టసుఖాలను, గ్రామ పరిస్థితులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు అడపా నరసింహమూర్తి , తుమ్మపాల రమేష్ , దాడి సూరి నాగేశ్వరరావు , శనివాడ నాయుడు బాబు ఎడ్ల రామ్మూర్తి, దొండా సాయి, దొండా సన్యాసిరావు, మండపాక బాబురావు, మైచర్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!