ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీనారా లోకేష్ రాజీనామా చేయాలి

నారా లోకేష్ రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

నారా లోకేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన – ఎబివిపి

జయజయహే : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జీవో నెంబర్ 77 రద్దు చేయాలని పి జి విద్యార్థులు కి న్యాయం చేయాలని జిల్లా కన్వీనర్ సంపత్ కుమార్ కోరారు. గత ప్రభుత్వం 2020 లో తీసుకువచ్చినటువంటి జి .నెంబరు .77 ప్రైవేట్ కళాశాలలో పీజీ విద్యను అభ్యసించాలి అనుకునే పేద విద్యార్థుల పాలిట శాపం గా తయారయ్యింది. ఆనాడు జి .నెంబరు 77 ఆమోదం లోకి వచ్చిన రోజు నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలను చేసి గత ప్రభుత్వ నాయకులకు నిద్ర లేకుండా చేసింది.అది అలా ఉంచితే ఎలక్షన్ కి ముందు నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జి .నెంబరు 77 రద్దు చేస్తామని తాను చేసిన యువగలం పాదయాత్రలో చాలాసార్లు ప్రస్తావించారు. కాగా వారి ప్రభుత్వం వచ్చి 328 రోజులు గడిచినా ఇంకా జి .నెంబరు 77 గురించి పట్టించుకోకపోవడం వారికి విద్యార్థుల మీద ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. అది అలా ఉంచితే మే 7 2025 న సి టి ప్రవేశ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ ఒక్క జి .నెంబరు 77 రద్దు చేయకుండా సి టి పరీక్షలు నిర్వహిస్తే ప్రైవేట్ కళాశాలలో ఎం బి , ఎం సి చదవాలనుకునే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి అని నేడు ప్రభుత్వాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిలదీస్తుంది సి టి పరీక్షలకు ముందే జి .నెంబరు 77 ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా రద్దు చేస్తున్నట్టు ప్రకటించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలను చెయ్యడానికి అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనకడుగు వెయ్యదని హెచ్చరిస్తున్నాము . విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జి .నెంబరు77 రద్దు చెయ్యాలని అని సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి విభా కన్వీనర్ సాయికుమార్, కార్యవర్గ సభ్యులు వంశీ, ఎబివిపి కార్యకర్తలు కృష్ణ ,చాణక్య , నాని పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!