ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీ"తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని" నిర్వహించిన "శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్"

“తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని” నిర్వహించిన “శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్”

📰 Generate e-Paper Clip

విజయనగరం: జయజయహే : తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్బంగా బుధవారం ఉదయం శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ నిర్వహించారు.ఈ సందర్బంగా క్లబ్ సభ్యులంతా తెలుగు నాటక రంగానికి ఎనలేని కృషి, సేవలందిస్తున్న బహుముఖ ప్రజ్ఞాసాలి, నటులు, ప్రముఖ కళాకారులు రాంబర్కి రామానాయుడు ను సత్కరించారు.

ఈసందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన నాటకరంగం ఈ హైటక్ యుగంలో టెక్నాలజీ, సెల్ ఫోన్ ప్రభావంతో మసకబారుతొందని, విజ్ఞానంతో పాటు, విలువలు, వినోదాన్ని పంచే నాటకరంగాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థినీవిద్యార్థులకు.. కళలపైన,కళారంగంపైన, మన దేశ మహనీయుల వేషదారణలు వేయించి విద్యార్థుల్లో నైతిక విలువలు, నాటక రంగాన్ని గుర్తుచేస్తూ అవగాహన కల్పించుటలో ప్రముఖ పాత్రను కళాకారులు రాంబర్కి రామానాయుడు పోషిస్తున్నారని అయన సేవలను కొనియాడుతూ… పూర్వం తెలుగు నాటక రంగానికి కృషిచేసిన మహనీయులను స్మరించు కున్నారు .కార్యక్రమంలో క్లబ్ పెద్దలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!