ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీతిరుపతిలో రాజకీయ రచ్చ గోశాలలో ఆవుల మృతి వ్యవహారంపై దుమారం నడి రోడ్డు మీద...

తిరుపతిలో రాజకీయ రచ్చ గోశాలలో ఆవుల మృతి వ్యవహారంపై దుమారం నడి రోడ్డు మీద ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు గోశాలకు రావాలంటూ టీడీపీ నేతలు సవాల్ రోజంతా ఉద్రిక్త పరిస్థితులు

📰 Generate e-Paper Clip

టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రచ్చ సాగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీల నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నారు. రోడ్డుపై పడుకుని ఆందోళనకు దిగారు. . పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు భూమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఛాలెంజీపై తాను స్పందించానని, తనను రమ్మని వాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు. తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని.. టీడీపీ నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు. పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు. కాగా అంతకుముందు పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి సిద్ధమయ్యారు. దీంతోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై పడుకుని పోలీసులు తీరుపై నిరసన తెలిపారు. కాగా టీటీడీ గోశాలల్లో మూగ జీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితి. ఆవుల మృతిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు అబాసుపాలైంది. గో సంరక్షణ శాలల్లో మూగ జీవాల మృతి వెనుక ఉన్న రాజకీయాలేంటి.. గత పాలక మండలి నిర్వాహకాలపై విజిలెన్స్ నివేధికలోని అంశాలను గత వైసీపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. శాంతి ర్యాలీ పేరుతో వందలాది కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో‌ గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడవచ్చని కూటమి ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!