తిరుపతిలో రాజకీయ రచ్చ గోశాలలో ఆవుల మృతి వ్యవహారంపై దుమారం నడి రోడ్డు మీద ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు గోశాలకు రావాలంటూ టీడీపీ నేతలు సవాల్ రోజంతా ఉద్రిక్త పరిస్థితులు
టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రచ్చ సాగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీల నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నారు. రోడ్డుపై పడుకుని ఆందోళనకు దిగారు. . పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు భూమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఛాలెంజీపై...