ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీజీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ కి జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్ లేఖ

జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ కి జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్ లేఖ

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ కి జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్ తమ వార్డులో ఉన్న రకరకాల సమ్యస్యల కోసం లేఖ వ్రాసారు.

గౌరవనీయులైన జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ హరేంద్ర ప్రసాద్ కి నమస్కరించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు నమస్కరించి వ్రాయినది ఏమనగా

అయ్యా!

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 48వ వార్డు అంతా కూడ కొండవాలు ప్రాంతంతో కలిపి ఉండడం వలన వార్డులో అనేక రకాల సమస్యలు నెలకొని ఉన్నాయి.విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతం అత్యధికముగా ఉండి జాతీయ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వార్డులలో ముఖ్యంగా 48వ వార్డు ప్రధానంగా ఉంది.గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పడి గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో వార్డులో అనేక సమస్యలు ముఖ్య నాయకులు,అధికార యంత్రాంగం సహకారంతో పరిష్కారం చూపడం,అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.అయినప్పటికీ వార్డ్ లో కొన్ని చోట్ల రోడ్లు కాలువలు ప్రధాన డ్రైనేజీలు మరమ్మతరలకు గురి కావడం జరిగింది. 48 వార్డులో ప్రధాన ప్రాంతమైనటువంటి లాల్ బహుదూర్ నగర్,రాంజీ ఎస్టేట్ ప్రాంతంలో చాలావరకు రోడ్లు,కాలువలు,డ్రైనేజీలు రిటైనింగ్ వాల్స్ మరమ్మతులకు గురై ఉన్నాయి. వీటివలన వాహనదారులకు,పాదచారులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాలువలు మరమ్మతులు కావడం వలన కొండ ప్రాంతంలో ఎగువ నుంచి వచ్చే చెత్త,చెదారం కాలువలో నిండిపోయి వ్యర్ధాలు రోడ్లపైకి వచ్చి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతున్నాయి. కొండ ప్రాంతంలో చిన్న చిన్న రోడ్లు ఉండడం వల్ల అవి మరమ్మతులు గురై వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇందులో భాగంగా రాంజీ ఎస్టేట్, ఎల్బీనగర్ ప్రాంతంలో కొన్నిచోట్ల వీధి దీపాలు మరమ్మత్తుల గురై వెలగడం లేదు. కొండ ప్రాంతంలో రాత్రిపూట వీధి దీపాలు వెలగకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చాయని దీనిపై అధికారులు పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను..కావున గౌరవ ఇంచార్జ్ కమీషనర్ హరేంద్ర ప్రసాద్ గారు 48వ వార్డులో పర్యటన చేసి పైన తెలిపిన సమస్యలు నేరుగా చూసి అభివృద్ధి పనులకు తక్షణమే సహకారం అందించి వార్డు ప్రజలు క్షేమం కోరుకు తక్షణమే పనులు అయ్యేలా సహకారం అందించాలని కోరుకుంటున్నాను.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!