రావికమతం : జయజయహే : రావికమతం మండలం గర్నెకం గ్రామపంచాయతీలో కేజీబీవీ స్కూల్లో ఇంటర్మీడియట్ అదనపు తరగతుల వసతి సౌకర్యానికి చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు కోటి 43 లక్షలతో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రావికమతం మండల టిడిపి పార్టీ అధ్యక్షులు రాజన కొండ నాయుడు, కేజీబీవీ స్కూల్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు, రావికమతం సర్పంచ్ గంజి మోదినాయుడు, ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు, గొంప ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ, మరుపాక ఎంపిటిసి ముచ్చ సూర్యనారాయణ, మోడల్ స్కూల్ చైర్మన్ కే రాజు ,టిడిపి నాయకులు కోట గోవిందరావు, జెర్రీపోతుల రాంబాబు, రౌతు సత్తిబాబు, బంటు శ్రీనివాసరావు, గంజి ఈశ్వరరావు, కేశంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కళాశాల అదనపు భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
RELATED ARTICLES
