ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీకడప తెలుగుదేశం అడ్డా : సీఎం చంద్రబాబు

కడప తెలుగుదేశం అడ్డా : సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తోందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు.

 కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడు బహరింగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు ముఖ్యమంత్రి. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు. జనసంద్రంగా కడప నిండిపోయిందన్నారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం తెలిపారు.

కానీ కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవునిగడపలో జరిగిందని..రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడప మార్పు కనిపిస్తోందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహరంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామన్నారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, 52 సీట్లకు 45 సీట్లతో కూటమని గెలిపించారన్నారు. వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే టీడీపీ కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోనే ఏడు సీట్లు గెలిపించారన్నారు. ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నామని.. కానీ ఓడిపోయిన పార్టీ ఇంకా అర్థం చేసుకోలేదన్నారు. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!