కడప తెలుగుదేశం అడ్డా : సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తోందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు.  కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడు బహరింగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు ముఖ్యమంత్రి. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు. జనసంద్రంగా...