ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవిద్య సమాచారంఏపీలో రేపటి నుంచి గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలు

ఏపీలో రేపటి నుంచి గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలు

📰 Generate e-Paper Clip

13 పరీక్ష కేంద్రాలు.

4,496 మంది అభ్యర్థులు

అమరావతి: జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని,ఉదయం 8:30నుండి 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపింది.

అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!