ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో జనసేన లో భారీగా చేరికలు

ఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో జనసేన లో భారీగా చేరికలు

📰 Generate e-Paper Clip

పెందుర్తి జయ జయహే: పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నర్సీపట్నం మండల వైస్ ఎంపీపీ ఇన్నం రత్నం, ఇన్నం రమణ, నర్సీపట్నం వైసీపీ సీనియర్ నాయకులు మీసాల సత్యనారాయణ, నాతవరం మండలం వైసీపీ మాజీ యూత్ అధ్యక్షులు పోలుపర్తి శ్రీనివాస్, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు, భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పలనాయుడు బొగ్గు మోహన్, దుర్గా ప్రసాద్, అడ్డూరి రామారావు, దేవర సత్యనారాయణమూర్తి, మామిడి అరుణ నర్సీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో పంచకర్ల రమేష్ బాబును కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు అంకితభావంతో పని చేయాలన్నారు. జనసేన అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, జిల్లా కార్యదర్శి పంచడ హరినాథ్ అల్లాడ సురేష్, గొలగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు కోన నారాయణరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

           

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!