ఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో జనసేన లో భారీగా చేరికలు

పెందుర్తి జయ జయహే: పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నర్సీపట్నం మండల వైస్ ఎంపీపీ ఇన్నం రత్నం, ఇన్నం రమణ, నర్సీపట్నం వైసీపీ సీనియర్ నాయకులు మీసాల సత్యనారాయణ, నాతవరం మండలం వైసీపీ మాజీ యూత్ అధ్యక్షులు పోలుపర్తి శ్రీనివాస్, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి...