ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారంలో గురువారం దివంగత శ్రీనాథు కనక లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమేష్(ఎల్ఐసీ) సహకారంతో విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డి సత్యారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.విశాఖకు చెందిన పలు కార్పెరేట్ ఆసుపత్రుల ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరంలో రోగులకు ఉచితంగా తనిఖీలు నిర్వహించి మందులు అందజేశారు.రోగులకు గుండె సంబంధిత పరీక్షలు,ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా చేశారు.పరిసర మండలాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు.సుమారు 350 మందికి వైద్య సేవలు అందించారు. విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి నుండి ఆంకాలజిస్టులు పాల్,మురళీకృష్ణ, హారిక, వీఆర్వో పీఎం నాయుడు,ఎన్నారై ఆసుపత్రి నుండి వైద్య నిపుణులు పరమేశ్వర రావు,హరి కిషోర్,సుజిత్ కుమార్,సౌమ్య, హేమంత్,సుజాత, పిఆర్ఓ త్రినాధ్ వారి బృందం హాజరయ్యారు. అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి ఈ నెల రెండో తేదీన సంబంధిత ఆసుపత్రికి తరలించి ఉచిత చికిత్సలు అందిస్తారని రమేష్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!