ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
మాడుగుల : జయజయహే : మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారంలో గురువారం దివంగత శ్రీనాథు కనక లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమేష్(ఎల్ఐసీ) సహకారంతో విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డి సత్యారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.విశాఖకు చెందిన పలు కార్పెరేట్ ఆసుపత్రుల ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరంలో రోగులకు ఉచితంగా తనిఖీలు నిర్వహించి మందులు అందజేశారు.రోగులకు గుండె సంబంధిత పరీక్షలు,ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా చేశారు.పరిసర మండలాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు.సుమారు...