ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే పూజలు

📰 Generate e-Paper Clip

మాధవధార :జయజయహే : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని మాధవధార కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం పూజలు చేశారు. ఆయనకు 50వ వార్డు టిడిపి అధ్యక్షులు సనపల వరప్రసాద్ స్వాగతం పలికారు.భారత సైనికులు,ప్రజలు క్షేమంగా ఉండాలని పూజలు చేశారు.ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారతదేశంలోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దేశ భద్రత కోసం సరిహద్దులలో పోరాడుతున్న భారతీయ సైనికులు క్షేమంగా ఉండాలని వరప్రసాద్ కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ సురేష్ బాబు,51వ బిజెపి అధ్యక్షులు తమ్మినేని పద్మజ, 51వ వార్డు టీడీపీ అధ్యక్షులు సనపల కీర్తి, తాతినేని శ్రీనివాస్, కిల్లి శ్రీరామ్మూర్తి,దిలీప్ రాజు,సనపల నరసింహస్వామి, రామరాజ్యం, మూల వెంకట్రావు,దవళకుమారి, శాంతి,సనపల నాగచంద్రుడు, ఉదంతరావు, సనపల నారాయణస్వామి,పొన్నాడ రాంబాబు,కూటమి నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!