ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే పూజలు

మాధవధార :జయజయహే : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని మాధవధార కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం పూజలు చేశారు. ఆయనకు 50వ వార్డు టిడిపి అధ్యక్షులు సనపల వరప్రసాద్ స్వాగతం పలికారు.భారత సైనికులు,ప్రజలు క్షేమంగా ఉండాలని పూజలు చేశారు.ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారతదేశంలోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దేశ భద్రత కోసం సరిహద్దులలో పోరాడుతున్న భారతీయ సైనికులు క్షేమంగా ఉండాలని వరప్రసాద్ కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో ఉత్తర...