ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి

ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి

📰 Generate e-Paper Clip

ప్రపంచం మెచ్చేలా రాజధాని

మోడీ సహకారంతో సరికొత్త రూపు

సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం

జూన్ 21 విశాఖ యోగా డేకి ప్రధానికి అహ్వానం

జయజయహే : రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు . అమరావతి పనుల పునంప్రారంభం సభలో మాట్లాడారు. గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం అవుతున్నాయన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది. ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అమరావతి ప్రతిరూపం అని చంద్రబాబు ఉన్నారు. 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారన్నారు. అమరలింగేశ్వరస్వామి, కృష్ణానది, బౌద్ధ ఆరామాలకు నిలయం అమరావతిగా తెలిపారు. వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. అమరావతి వంటి ఉద్యమాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని.. అమరావతి రైతులకు నా సెల్యూట్‌ అని తెలిపారు. 2024లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు. ఐదు కోట్లమంది గర్వంగా నా రాజధాని అని చెప్పుకొనేలా అమరావతి అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మోదీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని.. మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోదీ రావాలని కోరారు. ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుందని.. ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతిని అనుసంధానం చేస్తామని తెలిపారు. 5 లక్షలమంది విద్యార్థులు అమరావతిలో చదువుకుంటారన్నారు. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని గ్రీన్‌ ఎనర్జీతో కాలుష్య రహితంగా అమరావతి అభివృద్ధి ఉంటుదని తెలిపారు. ఇప్పటికే అత్యుత్తమ విద్యాసంస్థలు అమరావతికి వచ్చాయి. బిట్స్‌పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి మరిన్ని విద్యాసంస్థలు రాబోతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తవుతుందన్నారు. అమరావతినే కాదు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తిచేస్తామని.. భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాదికి పూర్తిచేస్తామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రానికి గూగుల్‌, టీసీఎస్‌ రాబోతున్నాయి.. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం.. కడపలో స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నంలో పోర్టు వస్తాయి.. ఓర్వకల్లు నోడ్‌ డ్రోన్‌ హబ్‌గా మారుతోందని తెలిపారు. సాంకేతికతను మోదీ అర్థం చేసుకున్నట్లు మరెవరూ అర్థం చేసుకోలేరదని.. జూన్‌ 21న విశాఖలో యోగా డేకు ప్రధానిని రావాలని కోరారు. కులగణన చేయాలని మోదీ నిన్న నిర్ణయం తీసుకున్నారని అది గొప్ప నిర్ణయం అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించామని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నామని కేం ద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చంద్దరబాబు తెలిపారు. గత ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలోకి తెస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!