ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅమ్మాయిలదే హవా 84.09 శాతం ఉత్తీర్ణత పార్వతీపురం జిల్లా టాప్ అల్లూరి జిల్లాలో...

అమ్మాయిలదే హవా 84.09 శాతం ఉత్తీర్ణత పార్వతీపురం జిల్లా టాప్ అల్లూరి జిల్లాలో అత్యల్పం

📰 Generate e-Paper Clip

జయజయహే : ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా పదో తరగతి ఫలితాలు మంత్రి లోకేష్‌ విడుదల చేశారు. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదు చేశారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.78 శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు.1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువగా ఉత్తీర్ణత 47.64 శాతం నమోదు అయింది. గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 95.02% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్ధుల్లో ఫస్ట్‌ డివిజన్‌లో 65.36%, సెకండ్‌ డివిజన్‌లో 10.69%, థార్డ్ డివిజన్‌లో 5.09% ఉత్తీర్ణత పొందారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!