Saturday, April 11, 2026
Homeసినిమాఅభిమానులు ఆధ్వర్యంలో హిట్ -3 చిత్రం విజయోత్సవ వేడుకలు...

అభిమానులు ఆధ్వర్యంలో హిట్ -3 చిత్రం విజయోత్సవ వేడుకలు…

జయజయహే : అనకాపల్లి శిరిడి సాయి పర్తి సాయి థియేటర్లో హీరో నాషనల్ సార్ నాని నటించిన హిట్ – 3 చిత్రం శుక్రవారం నాడు విడుదలయ్యి ఘన విజయం సాధించిన సందర్భంలో అనకాపల్లి జిల్లా నాని ఫ్యాన్స్ అధ్యక్షులు గౌరీపట్నపు సురేష్ ఆధ్వర్యంలో ముందుగా అభిమానల సమక్షంలో విజయోత్సవ వేడుకల కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులకు మజ్జిగ ప్యాకెట్లు, మరియు థియేటర్ యాజమాన్యం ఫ్రూట్స్ పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాని ఫ్యాన్స్ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ మా హీరో నాని గారు ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో మొదటగా నిర్మాతగా కోర్టు చిత్రాని కొత్త నటీనటులతో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సందర్భంగా ఇప్పుడు మళ్లీ నాని గారు హీరోగా డైరెక్టర్ డాక్టర్ శైలస్ కొలను గారు తెరకెక్కించిన హిట్ – 3 చిత్రం ద్వారా ఈ రోజు విడుదలయ్యి మంచి విజయం సాధించింది ప్రేక్షకులు ఆదరణ పొందుకుంటున్నారని రానున్న రోజుల్లో హీరో నాని గారు మరొక చిత్రం పేరడైజ్ ద్వారా మన ముందుకు రాబోతున్నారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోఎస్. భానుచందర్ (అఖి), ఉప్పల సాయి, నాని అభిమానులు మణికంఠ, అరుణ కుమార్, నాని, నవీన్, రాజా, ప్రసాద్, ఉమ, పురుషోత్తం, చందు, నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు

                                   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?