రావికమతం : జయజయహే : మంచినీటి పథకానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అజయ్ పురం గ్రామస్తులు ఖాళీ బిందెలు, నీటి కావులతో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయ్ పురం గ్రామంలో 170 మంది జనాభా నివసిస్తున్నారు. 2019-20 సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 8 లక్షల 40 వేల రూపాయలు వాటర్ స్కీం ఏర్పాటు చేశారు. గత 15 రోజుల నుండి వాటర్ స్కీం కి విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో నీరు సరఫరా కావడం లేదు. దీoతో15 వ తేదీ ఆదివాసి గిరిజన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కీ మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని, జల్జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయాలని ఆందోళన చేయడంతో 16వ తేదీన పంచాయతీ కార్యదర్శి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ అజయ్ పురం గ్రామంలో పరిశీలన జరిపారు. పంచాయతీ కార్యదర్శి విద్యుత్తు అధికారులకు వాటర్ స్కీం కి విద్యుత్ కనెక్షన్ ఇప్పించండి అని దరఖాస్తు పెట్టారు. నేటికీ విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో.l అజయ్ పురం గ్రామం నుండి ఎర్ర కొండ దగ్గర్లో ఉన్న కావిల్లు కట్టుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ చేలవులో నీళ్లు తెచ్చుకుంటున్నారు. చేలవులో నీళ్లు తాగడం వల్ల జలుబు,జ్వరాలు వస్తున్నాయనీ తక్షణమే విద్యుత్ అధికారులు వాటర్ స్కీం కి విద్యుత్ సరఫరా చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రయ్య,సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు కోరుతున్నారు.జీలుగుల్లావా. పశువులుబంధ గ్రామాలకు మంచినీరు సౌకర్యానికై జిల్లా పరిషత్ 15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి తక్షణమే నిధులు విడుదల చేయాలనీ కోరుతున్నారు.
Homeశివ సూర్య డైలీవాటర్ స్కీం కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కావిడి, ఖాళీ బిందెలతో ఆదివాసి గిరిజనులు...
వాటర్ స్కీం కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కావిడి, ఖాళీ బిందెలతో ఆదివాసి గిరిజనులు వినూత్నంగా నిరసన
0
79
RELATED ARTICLES

