ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపెండింగ్ బిల్లులు చెల్లించమని కలెక్టర్ ను కోరిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు

పెండింగ్ బిల్లులు చెల్లించమని కలెక్టర్ ను కోరిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం: జయ జయహే: విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ ను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ రొంగలి జగన్నాథం ఆధ్వర్యంలో జీవీఎంసీ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు . జీవీఎంసీ లో గత సంవత్సరం కాలంగా పెండింగ్ లో ఉన్న సుమారు నాలుగు వందల కోట్లు రూపాయలు ఇయండిలు చెల్లించమని, కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఉన్నందున గత మార్చి నెలలో రెవెన్యూ అధికంగా వచ్చినందున కనీసం ఐదు ఆరు నెలలు బిల్లులు చెల్లించమని విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఇయండిలు ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని తరువాత ఆర్థిక పరిస్థితి పరిశీలించి రెండు మూడు నెలల బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు గొంప చంద్రమౌళి,రందిసాధూ రావు పి.యస్. ప్రసాద్, గుర్రాల దేవుడు,అంగ రమేష్, టి. గుహేశ్వర రావు యస్ సి అప్పారావు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!