ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమోడల్ ప్రైమరీ స్కూల్ గా ఎంకోడూరు పాఠశాల - ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించండి

మోడల్ ప్రైమరీ స్కూల్ గా ఎంకోడూరు పాఠశాల – ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించండి

📰 Generate e-Paper Clip

మాడుగుల: జయజయహే : ఇప్పటివరకు ప్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతులకు పరిమితమైన ఎం కోడూరు ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి త్రీ ప్రైమరీ తో పాటు ఒకటి రెండు తరగతులు ఈ పాఠశాలలో బోధించేవారు. మిగిలిన తరగతులు హైస్కూల్ స్థాయిలో ఉండేవి. అయితే ఈ ఏడాది నుంచి ఈ పాఠశాలను ప్రైమరీ మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతూ ఒకటి నుంచి ఐదు తరగతి వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయ విద్యాబోధన జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత పాఠశాలలో 45 మంది విద్యార్థులు అభ్యసిస్తుండగా ఈ ఏడాది వంద మంది విద్యార్థులను చేయలన్నది లక్ష్యంగా పెట్టుకొనీ పాఠశాల విద్యా కమిటీ, ప్రధానోపాధ్యాయుడు, అంగన్వాడి టీచర్ తదితరులు ఇంటింటికి తిరిగి విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం వేలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా అప్ గ్రేడ్ చేస్తూ పూర్తి స్థాయిలో ఉపాద్యాయల నియామకం, మధ్యహన భోజనంతో పాటు ఆంగ్ల బోధన,ఇంటర్నెట్ సదుపాయం,డిజిటల్ క్లాసులు తో నిర్వహించడం జరుగుతా దన్నారు.కాబట్టి తల్లి దండ్రులు తగుసహకారం అందించి మన గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనికోరారు. ఇంటింట ప్రచార కార్యక్రమo లో స్కూల్ కమిటీ చైర్మెన్ వి కిషోర్,అంగన్వాడి టీచర్లు కుమారి,రామలక్ష్మి,పద్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.       

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!