Tuesday, April 7, 2026
Homeశివ సూర్య డైలీమ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా డాక్టర్ కొండి శెట్టి సురేష్...

మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు

ఫరీదాబాద్‌ లో జరిగే ప్రతిష్ఠాత్మకమైన మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ఈసారి విజయవాడ నుండి ప్రముఖ గౌరవ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు ను 15 వ సారి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం విశేషం. మ్యాజిక్ మరియు ఆర్ట్స్ యూనివర్సిటీ మరియు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సంయుక్తంగా ఏప్రిల్ 12 న, శనివారం ఫరీదాబాద్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. భారతదేశం నలుమూలల నుండి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరై అవార్డులు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అధికార అనుమతుల తో, మ్యాజిక్ బుక్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ సి.పి. యాదవ్ ఆధ్వర్యంలో, ప్రపంచ ప్రఖ్యాత మెజీషియనే సమక్షంలో నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ రామ్ అవతార్ శర్మ, వ్యవసాయ జిల్లా అధికారి డాక్టర్ రాజేంద్ర సైనీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు పాల్గొనడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ విషయాన్ని విజయవాడలోని తన కార్యాలయంలో డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు మీడియాకు తెలియజేశారు. మ్యాజిక్ మరియు ఆర్ట్స్ రంగాలలో తన సేవలకు ఈ గుర్తింపు మరోసారి లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?