Friday, April 10, 2026
Homeభక్తిశ్రీ నందీశ్వరుని ప్రధమ వార్షికోఉత్సం ..

శ్రీ నందీశ్వరుని ప్రధమ వార్షికోఉత్సం ..

లక్కవరుపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామం కొత్త బోజంకి వారి కల్లాల లో వెలసిన శ్రీనందీశ్వరుని ప్రధమ వార్శికోఉత్సవం జరుగుతుందని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది.నేడు ఉదయం అయిదు గంటలకు స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయని అనంతరం ప్రత్యేక పూజలు గ్రామ పురోహితుడు రాముశర్మ నిర్వహిస్తారని పూజలలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి దర్శనం చేసుకొని మధ్యాహ్నం జరిగే అన్నసమారాధనలో అన్న ప్రసాదం స్వేకరించి స్వామి వారి కృపా కటాక్షములు పొందాలని భక్తులను కమిటీ కోరింది. వార్షికోత్సవంలో భాగంగా సాయంత్రం పౌర్ణమి తగులు పూజ,భక్త బృందంచే కోలాట ప్రదర్శన తో పాటు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సింహాద్రి అప్పన్న అఖండ నామ సంకీర్తన జరుగునని ఆలయ కమిటీ తెలియజేసింది. అత్యంత మహిమ గల నందీశ్వర స్వామి దేవాలయం దినదినాభివృద్ది చెందేందుకు భక్తులు అన్నివిధాలా సహకరించాలని,దర్శనంకి దేవాలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో పరిశుభ్రత పాటించి కమిటీ వారికి సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?