ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీ"శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్" ఆద్వర్యంలో "అంబేద్కర్ జయంతి"

“శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్” ఆద్వర్యంలో “అంబేద్కర్ జయంతి”

📰 Generate e-Paper Clip

విజయనగరం: జయజయహే : ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ వేడుకలను నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి క్లబ్ పెద్దలు, ఎలక్ట్ గవర్నర్ ఎ.తిరుపతిరావు, క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు మాష్టారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎలక్ట్ గవర్నర్ తిరుపతి రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు కోసం, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని, ఇటువంటి మహనీయున్ని ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకున్నందుకు భారతీయులు గా మనమంతా గర్వించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ పెద్దలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!