ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఆరు బయటే జయంతి: తలుపులు కూడా తీయని నాయకులు: ఉత్సవాలకు తొంగి చూడని వైనం అంబేద్కర్...

ఆరు బయటే జయంతి: తలుపులు కూడా తీయని నాయకులు: ఉత్సవాలకు తొంగి చూడని వైనం అంబేద్కర్ వారసుల మంటారు మండిపడుతున్న కాంగ్రెస్ వాదులు

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల వైపు ముఖ్య నాయకులు తొంగి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం నగరంలో గల పార్టీ కార్యాలయం తలుపులు కూడా తీయకపోవడంతో ఆరు బయటే అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి దీంతో కాంగ్రెస్ పార్టీలో అభిమానులే తీవ్రంగా మండిపడుతూ.. ఇదేనా అంబేద్కర్ కి ఇచ్చిన గౌరవం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి ముఖ్య నాయకులు పాల్గొనకపోవడం విశేషం.. కనీసం పార్టీ కార్యాలయం తాళాలు కూడా తీయలేని వైనం..అభిమానులతో కలిసి కస్తూరి వెంకట్రావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించుకున్నారు. దీంతో ఆ పార్టీ అభిమానులు అంబేద్కర్ జయంతి వేడుకలు గేటు బయట చేయవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ పార్టీ అభిమానులు తోపాటు కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ కస్తూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఏపీ సి సి స్పోర్ట్స్ చైర్మన్ జి వి వి ఎస్ కమలాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొనగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ అణగారిన జీవితాలకు ఆలంబన.. ఆత్మాభిమానపు స్వాలంబన.. భారత జాతి స్వేచ్ఛా పతాక సమత కోసం గళమెత్తిన చైతన్య గీతిక.. జాతి జనుల భవిత కోసం దారి చూపిన జయ కేతనం.. భారత రాజ్యాంగ రచనా చేతనం.. మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కొనియాడారు.134వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నేటి యువత నడవల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మాజీ చైర్మన్ భాష, విశాఖ యువజన అధ్యక్షులు అల్లిపిల్లి సతీష్, వెస్ట్ కోఆర్డినేటర్ కెవి సూర్యనారాయణ, వార్డు అధ్యక్షులు ఎం సత్యనారాయణ, కాకర అప్పారావు, గుర్రం కనకరాజు, షరీఫ్, ఈశ్వరరావు, వెంకటేష్, వరహాలమ్మ తో పాటు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!