Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీఅంబేద్కర్ ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి- ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు

అంబేద్కర్ ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి- ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు

విజయనగరం జయజయహే: భారత రాజ్యాంగ నిర్మాత ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరగాలని రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు అన్నారు.భారతరత్న డా. బి ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయనగరం లోని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా.డి.వి.జి. శంకరరావు మాట్లాడుతూ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలిఅన్నారు.న్యాయవాదిగా,ఆర్ధిక శాస్త్ర వేత్తగా,రాజకీయ నేతగా భారతదేశ చరిత్రలో అంబేద్కర్ తనదైన ముద్ర వేశారన్నారు.ఆయన ఆలోచనలను ప్రజలల్లోకి తీసుకువెళ్లి. అంతా చైతన్యం దిశగా సాగడమే నిజమైన నివాళిగా డాక్టర్ డివిజి శంకరరావు అన్నారు.ఈ కార్యక్రమంలో శివలలిత్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?