Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసమానత్వం, స్వేచ్ఛ కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్: హోం మంత్రి...

సమానత్వం, స్వేచ్ఛ కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్: హోం మంత్రి వంగలపూడి అనిత

అనకాపల్లి,జయజయహే : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్బంగా సోమవారం అనకాపల్లి పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి హోం మంత్రి వంగలపూడి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం గుండాల జంక్షన్ వద్ద ఉన్న ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు విజయ క్రిష్ణన్ అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకు హోం మంత్రి ముఖ్య అతిదిగా హాజరయ్యారు. కార్యక్రమనికి ముందుగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దేశం ఏకతాటిపై నడుస్తునడానికి కారణం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లే అన్నారు. ఇందులో ముఖ్యంగా విద్య అనే ఆయుధం ఉపయోగ పడిందని, విద్య ఒక ముఖ్య సాధనమని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ లో ముగ్గురు మహనీయుల జయంతి జరుపుకున్నామని తెలిపారు. సమాజానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేసిన మహానుభావులని అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆని ఆయన విగ్రహాం లేని ఊరు లేదు-వాడ లేదు అన్నారు. అంబేద్కర్ ఎన్నో అవమానాలు పడ్డారని, స్వేఛ్ఛ, సమానత్వం కోసం అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేసారని చెప్పారు. అంబేద్కర్ నిత్య విద్యార్థి ఆని అయన జీవితాంతం చదువు కొనసాగించారాని, నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా ముందుకు వెలుతున్నామని ఆమె పేర్కొన్నారు. అంబ్కేదర్ కు మనం ఇచ్చే గౌరవం-ఆయన సిద్ధాంతాలను గౌరవించడమేనని అన్నారు. షెడ్యూల్డ్ కులాల వారి కోసం జిల్లా కేంద్రంలో ఎస్సీ భవనం, విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం అని, వీటికి తగిన ప్రతిపదనలు ప్రభుత్వానికి పంపించాలని కాలెక్టర్ ని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమానత్వం కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లుగా భావిస్తూ వారికి అత్యుత్తమ సేవలందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమం అనంతరం హోం మంత్రి వంగలపూడి అనితను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు కొణతల రామకృష్ణ, శాలువాతో సత్కరించిన గౌతమి బుద్ధుని విగ్రహాన్ని బహుకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?