అనకాపల్లి జయ జయహే, మే 26: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనకాపల్లి పట్టణం, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, గవరపాలెం లో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల రోజులపాటు నిర్వహించనున్న ఈ “యోగాంధ్ర – 2025” కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.లావణ్య, యోగా గురువులు శ్రీను, చంద్రిక, శివ, సతీష్, జగన్ తదితరుల మార్గదర్శనంలో అధికారులు, సిబ్బంది యోగా అభ్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీసు సిబ్బంది రోజూ విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి యోగా అత్యంత సమర్థవంతమైన మార్గం. క్రమంగా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు,” అని పేర్కొన్నారు.
అలాగే, “యోగాను మన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఇది మనం తీసుకునే ఆహారం లాంటిదే. దీర్ఘకాలికంగా చూస్తే యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ యోగాను జీవితశైలిగా అలవర్చుకోవాలి,” అని పిలుపునిచ్చారు.
నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు యోగా గురువు, అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు బి.మోహనరావు, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణ్ మూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మీ, గఫూర్, రమేష్, రామకృష్ణ, మన్మధరావు, జిల్లా సీఐలు, ఎస్సైలు, సివిల్ మరియు ఏ.ఆర్.పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


