ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీజమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో ఘోరం

జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో ఘోరం

📰 Generate e-Paper Clip

: కడప జిల్లా, జమ్మలమడుగులోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.
ప్రభుత్వం, పోలీసులు అత్యాచార ఘటనలపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు ఆగడంలేదు… తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా , జమ్మలమడుగు లోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 7 ఏళ్ల బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఇద్దరు పిల్లలపైన అత్యాచారం చేయబోయాడు. అయితే సకాలంలో గుర్తించిన కాలనీ వాసులు యువకుడిని పట్టుకున్నారు. కామాంధుడికి దేహశుద్ది చేసి.. జమ్మలమడుగు పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా మూడు రోజుల క్రితం కడప జిల్లా, ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని.. మైలవరం మండలం కంబాలదిన్నేకు బంధువుల పెళ్లికి వెళ్లారు. అక్కడ పెళ్లి మండపం బయట బాలిక ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి.. బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటపడుతుందని భయపడి బాలికను దారుణంగా హత్య చేశాడు.అయితే తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీపంలో గాలించారు. ఈ క్రమంలో ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!