:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు: ఎట్టకేలకు బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాణిని విచారిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వెంకటాచలం పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాకాణి అరెస్టు విషయం తెలుసుకున్నవైసీపీ నేతలు, కార్యకర్తలు నెల్లూరు, వెంకటగిరికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డీటీసీ దగ్గరకు మీడియాను పోలీసులు అనుమతించలేదు.
బెంగళూరులో అరెస్టు..
కాగా మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా పరిధిలోని క్వార్ట్జ్ ఖనిజాన్ని ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా కొల్లగొట్టారు. ఆ క్రమంలో మంత్రి హోదాలో కాకాణి కూడా తన నియోజకవర్గం పరిధిలోని పొదలకూరులో మైన్‌ను అక్రమించుకుని రూ. వందల కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అప్పల్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి, టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకాణిని ఏ-4గా చేర్చారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్..! 14 రోజుల రిమాండ్..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసులో దాదాపు రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ను తాజాగా అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కాకాణిని పోలీసులు జైలుకు తరలిస్తున్నారు.
నివసించే విద్యాకిరణ్ అనే వ్యక్తికి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల్లో రుస్తుం మైన్స్ ఉన్నాయి. దాని లీజు గడువు ముగియడంతో రెన్యువల్‌కు దరఖాస్తు చేశారు. దీన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో రెన్యువల్ చేయకుండా అక్రమంగా ఆక్రమించుకుని క్వార్ట్‌జ్ తవ్వుకుని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు కాకాణిపై ఉన్నాయి. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన ఈ దందాపై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం కాకాణి కోసం గాలిస్తోంది.
థ్యంలో బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్ లో కాకాణి ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా కాకాణి పట్టించుకోలేదు. అంతే కాదు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో అరెస్టు తప్పదని నిర్ధారణకు వచ్చాక అజ్ఢాతంలోకి వెళ్లిపోయారు. ఇలా 55 రోజులు అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.

