మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్..!

:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు: ఎట్టకేలకు బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాణిని విచారిస్తున్నారు. సోమవారం...