పెందుర్తి జయ జయహే… పినగాడి పంచాయతీలో సురపనేని సుబ్రమణ్యం పంట పొలాల్లో సుమారు 12 అడుగుల పొడవు గల కొండచిలువ కొద్ది రోజుల క్రితం పంట పొలాల్లో తిరుగుతుండటం స్థానికులు చూసి స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ కుమార్ కు మొబైల్ ద్వారా సమాచారం అందించారు కిరణ్ కుమార్ తన రెస్క్యూ టీం సహాయంతో పొలం వద్దకు శనివారం చేరుకొని కొండచిలువ మరియు గుడ్లను పట్టుకొని కంబాల కొండకు సురక్షితంగా పామును మరియు గుడ్లను తరలించారు ఈ సందర్బంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సుమారు 3500 పాములను పట్టుకున్నట్టు పత్రికా ముఖంగా తెలియజేశారు ఎప్పుడైనా, ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాల్లో విష సర్పాలు మరియు పాములు కనిపిస్తే ఈ క్రింది నెంబర్ కు 8866368899 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రొక్కం కిరణ్ స్నేక్స్ సొసైటీ ఫౌండర్ తెలిపారు


