Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీథియేటర్ల బంద్‌ లేదు.. ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక ప్రకటన

థియేటర్ల బంద్‌ లేదు.. ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక ప్రకటన

థియేటర్ల వివాదం నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జాయింట్ మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఎగ్జిబిటర్స్,

టాలీవుడ్ లో థియేటర్స్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రెంటల్ విధానానికి బదులు పర్సెంటేజీల సిస్టమ్ తీసురావాలనే డిమాండ్ తో ఈ వివాదం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఇదే అంశం మీద డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనూ పర్సంటేజ్‌ విధానాన్నే అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. లేదంటే జూన్‌ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో శనివారం మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా థియేటర్ల స్ట్రైక్ పై కీలక ప్రకటన చేశారు.

థియేటర్ల వివాదంపై చర్చించడానికి ఫిల్మ్‌ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్‌ రాజు, ఏఎం రత్నం, ఎస్. నాగవంశీ, సురేష్‌ బాబు, మైత్రీ రవి, సి. కళ్యాణ్, ఎన్వీ ప్రసాద్ సహా పలువురు నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మీటింగ్ అనంతరం ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్‌ లాంటిది ఏమీ ఉండదని ప్రకటించారు

థియేటర్ల వివాదం నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జాయింట్ మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్‌ 1 నుంచి థియేటర్లను బంద్‌ చేయటం లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటించింది. ఈ మేరకు ఛాంబర్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.థియేటర్స్ బంద్‌ అనేది తప్పుగా చిత్రీకరించారని దామోదర ప్రసాద్‌ అన్నారు. చర్చలు జరగకపోతే జూన్‌ 1వ తేదీ నుంచి బంద్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనేది మాత్రమే నిజం అని, కానీ అందరూ థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారాన్నే ప్రచారం చేశారన్నారు. ప్రస్తుతానికి బంద్ ఏమీ లేదని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కొన్ని వార్తలు బిజినెస్‌ను దెబ్బతీస్తాయన్నారు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్‌ చేస్తున్నామనడం సరికాదని దామోదర ప్రసాద్‌ అన్నారు. థియేటర్ల బంద్‌ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధుల నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?