Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీహఫీజ్ సయీద్‌ మాదేశ ' దేవదూత' పాకిస్థాన్

హఫీజ్ సయీద్‌ మాదేశ ‘ దేవదూత’ పాకిస్థాన్

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి మరీ బరితెగించింది. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి, నర హంతకుడు హఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రశంసల్లో ముంచెత్తింది. ఆయన మానవతా వాది, దేవ దూత, ప్రాణ దాత అంటూ ఆకాశానికి ఎత్తింది. ‌దీన్ని బట్టి పాకిస్థాన్.. ఉగ్రవాదాన్ని ఎలా రెచ్చగొడుతుందో.. ఉగ్రమూకల కనుసన్నల్లోనే పాక్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

పాకిస్థాన్ ఉగ్రదేశం అని ఈసారి వందశాతం నిరూపించుకుంది. ఇప్పటి వరకూ వెనకాల ఉండి పాలు పోసి పెంచిన పాక్.. ఇప్పుడు పది అడుగులు ముందుకేసి తన అసలు ముఖాన్ని ప్రపంచం ముందు ఉంచింది. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ ను ఏకంగా తమ దేశ దేవదూత, దాతృత్వ వంతుడు, ఆయనకు గుడ్ విల్ ఎక్కువ అని ప్రశంసల్లో ముంచెత్తింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో హఫీజ్ సయీద్ ను దాత, దేవదూత గా ప్రకటించింది.
దీన్ని బట్టి పాకిస్థాన్ ప్రార్థించేది ఎవరినో అర్థం అవుతుంది. హఫీజ్ సయీద్ ను దేవ దూతగా ప్రకటించడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’ ఉగ్రవాదులు. పహల్గాం దాడి హఫీజ్ సయీద్ ఆదేశాలతోనే జరిగినట్లు నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం.

ఇక హఫీజ్ సయీద్ లాహోర్ లోని రద్దీ వీధుల్లో దర్జాగా తిరుగుతున్నట్లు సమాచారం. అతడి నివాసంలో మసీదు, మదర్సా ఉన్నాయి. అతడి కోసం ఒక ప్రైవేట్ పార్కు కూడా ఉన్నట్లు నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. అయితే పాకిస్థాన్ మాత్రం అతడు జైలులో ఉన్నాడని మాయమాటలు చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం హఫీజ్ సయీద్ కు సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?