Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీజూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

ఉచిత దంత వైద్య శిబిరంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు. స్వాతి

శ్రీకాకుళం : జయజయహే : గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ ధరీ కొత్తపేట గ్రామంలో శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు. శంకర్ సతీమణి శ్రీకాకుళం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు.స్వాతి ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము శ్రీకాకుళం జిల్లా జూనియర్ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ దుంగ శ్రీధర్, శ్రీకాకుళం పట్టణ జూనియర్ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అధ్యక్షులు స్టేట్ వైడ్ కన్వీనర్ బుర్రి మదు ఆద్వర్యంలో తoగి సత్యన్నారాయణ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ డాక్టర్ తఓగి సౌజన్య పర్యవేక్షణలో పేద ప్రజలకు ఉచితంగా దంత పరీక్షలు చేసి ఉచితముగా మందులు పంపిణి చెయ్యడం జరిగినది. శ్రీకాకుళం నియోజిక వర్గ మహిళా అధ్యక్షురాలు గొండు. స్వాతి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య నటించిన దేవర సినిమా చాలా బాగుందని, ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు నటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. దుంగ శ్రీధర్, మధు మాట్లాడుతూ మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భముగా జిల్లాలో నాలుగు రోజులు పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామానికి చెందిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు గంగు మల్లేసు, గెంజి రామారావు, తంగి చంద్రరావులను గోండు స్వాతికి శాలువాతో సత్కరించారు . ఈ కార్యక్రమానికి కొత్త పేట తెలుగుదేశం పార్టీ నాయకులు గంగు నాగేశ్వరరావు , గంగు పెద్ద రమణ, జి .వాసు, గంగు రాజు, శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉపాధ్యకులు పి.గోవిందరావు, పి .శ్రీనివాసరావు, బొట్ట కామరాజు, విజయ్, శ్రీనివాస కార్తిక్, లక్ష్మణ్ రెడ్డి, బాస్కర్, ఇంటి.శంకర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుంగ శ్రీధర్, స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్, అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ , శ్రీకాకుళం బుర్రి మధు, అధ్యక్షులు ,శ్రీకాకుళం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ స్టేట్ వైడ్ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?