Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీప్రాణాలు తీస్తున్న డీజే

ప్రాణాలు తీస్తున్న డీజే

జయజయహే : డీజే శ‌బ్దాలు ప్రాణాలు తీస్తున్నాయి. పెళ్లిళ్లు, సంబ‌రాలు, వినోద కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహం కోసం డీజేలు ఏర్ప‌టు చేస్తున్నారు. పెళ్లిళ్ల ఊరేగింపుల్లో అయితే ఇది ఒక పెద్ద స్టేట‌స్‌గా కూడా ఫీల‌వుతున్నారు. అత్య‌ధిక సౌండ్‌తో గుండెల‌దిరేలా చేస్తున్నారు. దీంతో ప్రాణాలు సైతం పోతున్నాయి. అయినా పోలీసులు డీజే సౌండ్ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

2024లో యువ‌కుడి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2024 దసరా పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురంలో డీజే సౌండ్ బాక్సుల శబ్దానికి ఓ యువకుడి ప్రాణం పోయింది. దసరా ముగింపు వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఊరేగింపు వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగటంతో ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు డీజే సౌండ్ బాక్సులకు అతి సమీపంలో ఉన్న కారణంగానే గుండెపోటు వచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. తమ కుమారుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండారులంక గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

నేడు పాల‌కొండ‌లో యువ‌కుడి దుర్మ‌ర‌ణం…

పాలకొండ మండలం బాసూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది గ్రామంలోని ఒక వివాహ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తిని హార్ట్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబలించింది. గ్రామానికి చెందిన 36 ఏళ్ళ సుంకరి బంగారునాయుడు పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిన్న గ్రామంలో జరిగిన శుభకార్యం ఊరేగింపులో గ్రామస్తులతో కలిసి నృత్యం చేస్తూ గుండె పోటుతో హఠాత్తుగా మరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కళ్ళముందే ఉండే మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాసూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

నిబంధ‌న‌లు ఏమ‌య్యాయి

జ‌నావాసాల మ‌ధ్య ఊరేగింపులు నిర్వ‌హించేట‌ప్పుడు శ‌బ్ధ‌కాలుష్యం ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా ఉండాలి. ప‌రిమితికి మించి సౌండ్ పెంచితే సంబంధిత సౌండ్ సిస్ట‌మ్ నిర్వ‌హ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకునే చ‌ట్టం కూడా అమ‌ల్లో ఉంది. కానీ శుభకార్యాయాలు జ‌రిగేట‌ప్పుడు దాదాపు పోలీసులు వీటిపై క‌న్నెత్తి చూడ‌డం లేదు. డీజేలు ఏర్పాటు చేయాల‌న్నా… ఊరేగింపులు చేయాల‌న్నా పోలీసులు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. అయితే వీటిని ఎవ‌రూ పాటించ‌డం లేదు. అమ‌లు చేయాల్సిన పోలీసులు మౌనంగా ఉండిపోతున్నారు. డీజే సౌండ్‌తో అనేక అనర్థాలు కలుగుతాయి. డీజేలు అధిక స్థాయిలో శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి, ఇవి మానవ ఆరోగ్యానికి , పర్యావరణానికి హాని కలిగిస్తాయి.

ఆరోగ్యపరమైన సమస్యలు:

వినికిడి సమస్యలు: అధిక శబ్దానికి ఎక్కువసేపు గురికావడం వల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంది. డీజేలు సాధారణంగా 100 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం కలిగిస్తాయి, ఇది వినికిడికి చాలా ప్రమాదకరం. కొంత సమయం పాటు ఇలాంటి శబ్దాలకు గురైనా వినికిడి తాత్కాలికంగా మందగించవచ్చు లేదా టిన్నిటస్ (చెవుల్లో రింగుమనే శబ్దం) రావచ్చు.

హృదయ సంబంధిత సమస్యలు: అధిక శబ్దం ఒత్తిడిని పెంచుతుంది, దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది మరియు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట అధిక శబ్దానికి గురికావడం చాలా ప్రమాదకరం.

నిద్రలేమి: డీజేల వల్ల వచ్చే అధిక శబ్దం నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రలేమి వల్ల చిరాకు, ఏకాగ్రత లేకపోవడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మానసిక సమస్యలు: నిరంతరాయంగా అధిక శబ్దానికి గురికావడం వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు చిరాకు వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పిల్లలపై ప్రభావం: గర్భిణులు అధిక శబ్దానికి గురైతే పుట్టబోయే పిల్లల్లో వినికిడి సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలు అధిక శబ్దానికి మరింత సున్నితంగా ఉంటారు, కాబట్టి వారిలో ఏకాగ్రత మరియు అభ్యాసన సామర్థ్యంపై ప్రభావం పడుతుంది.

మెదడుపై ప్రభావం: కొన్ని సందర్భాల్లో, అధిక శబ్దం మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హేమరాజ్ ) వంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీయవచ్చు, అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది.

పర్యావరణపరమైన సమస్యలు:

ధ్వని కాలుష్యం: డీజేలు ఉత్పత్తి చేసే అధిక శబ్దం ధ్వని కాలుష్యానికి ప్రధాన కారణం. ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వారి జీవన నాణ్యతను తగ్గిస్తుంది.

వన్యప్రాణులపై ప్రభావం: అధిక శబ్దం వన్యప్రాణులకు భంగం కలిగిస్తుంది. ఇది వాటి ప్రవర్తనను మారుస్తుంది, వాటి కమ్యూనికేషన్‌కు ఆటంకం కలిగిస్తుంది మరియు వాటి పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

ఇతర సమస్యలు:

సామాజిక అశాంతి: అధిక శబ్దం వల్ల ప్రజల మధ్య ఘర్షణలు మరియు ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉంది.

నిబంధనల ఉల్లంఘన: భారతదేశంలో ధ్వని కాలుష్య నియంత్రణ చట్టాలు ఉన్నాయి, కానీ డీజే నిర్వాహకులు తరచుగా వాటిని ఉల్లంఘిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 45 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదు. సైలెన్స్ జోన్లలో (ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టుల సమీపంలో) ఈ పరిమితి మరింత తక్కువగా ఉంటుంది. డీజేల వల్ల కలిగే ఈ అనర్థాలను నివారించడానికి శబ్ద స్థాయిలను నియంత్రించడం, సమయ పరిమితులు పాటించడం మరియు ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా అవసరం.

             

క‌వి, స్పెష‌ల్ క‌ర‌స్పాండెంట్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?