జయజయహే : ఏపీ లిక్కర్ స్కాం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ స్కాం లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సిట్ పలువురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగి స్తోంది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురిని ఇందులో విచారణ చేసింది. కాగా, జగన్ కోటరీలో కీలకంగా పని చేసిన ఇద్దరిని సిట్ విచారిస్తోంది. ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. కాగా, వారి ముందస్తు బెయిల్ పిటీషన్ ను సుప్రీం తోసి పుచ్చింది. దీంతో, ఇక ఈ ఇద్దరి విషయంలో సిట్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీం తిరస్కరణ ఏపీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డికు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం లిక్కర్ కేసు దర్ యాప్తు కొనసాగుతున్నందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కాగా కృష్ ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలో హైకోర్టు నిరాక రించింది. దీంతో వారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈరోజు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ వేళ ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఈ ఇద్దరు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సిట్ 33 మందిని నిందితులుగా పేర్కొంది. అయిదు గురిని అరెస్ట్ చేసింది. తాజాగా, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈకేసులో కర్ణాటకలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంది. కేసులో బాలాజీ గోవిందప్పను ఏ33గా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు దాదాపు 10 గంటలకుపైగా విచారించారు. నిధుల పై ప్రశ్నలు ఈ ఇద్దరి విచారణ సమయంలో వైసీపీ హయాంలో కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు, వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయని సిట్ అధి కారులు ప్రశ్నించారు. తాము ఇప్పటి కప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్నించారని తెలిసింది. ధనుంజ యరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సంబంధీకులు, వారి సంస్థల ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలను సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధంలేదని చెప్పిన తెలుస్తోంది. ఈ ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ఫోన్లు స్వాధీ చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు సుప్రీం ముందస్తు బెయిల్ తిరస్కరించటంతో సిట్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారుతోంది.


