ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీతిరంగా ర్యాలీ - హాజరుకానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

తిరంగా ర్యాలీ – హాజరుకానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

📰 Generate e-Paper Clip

జయజయహే : ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భముగా ఎన్డీఏ కూటమి పార్టీల విజయవాడలో నేడు తీరంగా రన్ ర్యాలీ నీ నిర్వహించనున్నారు. నగరంలోని బందర్ రోడ్డులో ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిలు వరకు నిర్వహించే ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమం సందర్భంగా నగరంలో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. నగరంలో ప్రయాణించే పలు వాహనముల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ మల్లింపులు చేపట్టారు. రోడ్ షో బందర్ రోడ్డులో ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిలు వరకు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు జరుగు చున్నందున బందర్ రోడ్డులో బెంజ్ సర్కిలు నుండి ఆర్.టి.సి. వై జంక్షను వరకు, ఆర్.టి.సి. వై జంక్షను నుండి బెంజ్ సర్కిల్ వరకు ఎటువంటి వాహనములకు అనుమతి లేదు.

రామవరప్పాడు నుండి వారధి వైపుకు వెళ్ళు వాహనాలు….

మహానాడు జంక్షన్ ఆటోనగర్ రోడ్డు ఆటో నగర్ గేటు పటమట యన్.టి.ఆర్ సర్కిలు కృష్ణవేణి రోడ్డు. రామలింగేస్వర నగర్ స్క్రూ బ్రిడ్జి -వారధి వైపు వెళ్ళవలయును. అలాగే వారధి నుండి రామవరప్పాడు వెళ్ళు వాహనములు అదే రూట్ లో వెళ్లాలని సూచిస్తున్నారు. …పెనమలూరు నుండి బెంజ్ సర్కిల్ వైపు వచ్చు వాహనములు… ఆటో నగర్ గేటు ఆటోనగర్ రోడ్డు మహానాడు జంక్షన్ వైపుకు మళ్లింపు చేశారు. ….పెనమలూరు నుండి వారధి వైపు వచ్చు వాహనములు పటమట- యన్.టి.ఆర్ సర్కిలు , లింగేస్వర నగర్ స్క్రూ బ్రిడ్జి – వారధి వైపు నుండి వెళ్లాలని, అలాగే వారధి వైపు నుండి పెనమలూరు వైపు వెళ్ళు వారు వాహనములు అదే రూట్ లో వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.

ఆర్టీసీ బస్సులు మళ్ళింపులు..

విశాఖపట్నం, ఏలూరు వైపునుండి వచ్చు బస్సులు: రామవరప్పాడు రింగ్ ఏలూరు రోడ్ గుణదల చుట్టుగుంట హోటల్ స్వర్ణ పాలెస్ జంక్షన్ ఓల్డ్ పిసిఆర్ జంక్షన్ బస్టాండ్ అలాగే పిఎన్బి నుండి ఏలూరు వైపుకు వెళ్ళు బస్సులు అదే రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది.

మచిలీపట్టణం, గుడివాడ నుండి వచ్చు బస్సులు… తాడిగడప 100 అడుగుల రోడ్డు ఎనికెపాడు శ్రీ రామవరప్పాడు రింగ్ ఏలూరు రోడ్ – గుణదల టాకీస్ హోటల్ స్వర్ణ పాలెస్ జంక్షన్ ఓల్డ్ పిసిఆర్ జంక్షన్ పండిట్ నెహ్రూ బస్టాండ్ అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి మచిలీపట్టణం వెళ్ళు బస్సులు అదే రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. పండిట్ నెహ్రు బస్టాండ్ నుండి బందర్ రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్ వైపు వెళ్ళు సిటి బస్సులు ఓల్డ్ ఆర్టీసీ వై జంక్షన్ హోటల్ స్వర్ణ పాలెస్ జంక్షన్ విజయ టాకీస్ చుట్టుగుంట రామవరప్పాడు మహానాడు ఆటో నగర్ ఆటో నగర్ గేటు బందర్ రోడ్డు మీదుగా వెళ్ళి వెళ్లాలని,అలాగే పెనమలూరు మరియు ఆటో నగర్ నుండి పిఎన్బిఎస్ కు వెళ్ళు సిటీ బస్సులు అదే రూట్ లో వెళ్లాలని సూచిస్తున్నారు. తీరంగా రన్ ర్యాలీ కార్యక్రమానికి వచ్చు వాహనాలకు ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. లు, ప్రజలకు ఇబ్బందులు సాధ్యమైనంత కనీస స్థాయిలో ఉండేందుకుగాను చేపట్టిన మళ్ళింపు చర్యలను నగర ప్రజలందరు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!