ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీజాతీయ డెంగ్యూ దినోత్సవాన్నీ జయప్రదం చేయండి

జాతీయ డెంగ్యూ దినోత్సవాన్నీ జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

జయజయహే : గత కొన్నేళ్లుగా దేశంలో డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఏటా మే 16న జాతీయ డెంగి దినోత్సవం జరుపుకుంటున్నామని అల్లూరి జిల్లా ఏఎంఓ సత్యనారాయణ అన్నారు.గురువారం అరకులోయలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో లవరాజు ఈఓపిఆర్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 పంచాయతీల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఆయన మాట్లాడుతూ..ఈనెల 16న ప్రతి పంచాయితీలో డెంగి నివారణ అవగాహన దినోత్సవం నిర్వహించాలన్నారు.ఇది చాలా ప్రాణాపాయంతో కూడుకున్న వెక్టర్ వల్ల సంక్రమించే వ్యాధి అన్నారు.ఈ వైరస్ వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ పసుపు జ్వరానికి సంబంధించినది అన్నారు.డెంగ్యూ వైరస్ సోకిన ఏడీస్ దోమ కుట్టడం ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుందన్నారు.తీవ్రమైన తలనొప్పి కీళ్లనొప్పి కండారాల నొప్పి వికారం తొందరగా అలసిపోవడం జ్వరం వాంతులు ఐదు రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు తేలికపాటి రక్తస్రావం అత్యంత సాధారణ లక్షణాల్లో ఇది ఒకటి అన్నారు.ఇంటి చుట్టుపక్కల పారేసి వస్తువుల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలు ఇళ్లలో నిల్వ చేసే నీటిని వారానికి ఒకరోజు పూర్తిగా ఖాళీ చేసి డ్రైడే పాటించాలన్నారు. నీరు నిల్వ ఉండే తొట్టేలు డబ్బాలు వంటి వాటిపై మూతలు తప్పనిసరిగా ఉంచేలా చూడాలని డెంగ్యూ దరిచేరకుండా అనుసరించాల్సిన చిట్కాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో 14 పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!