జాతీయ డెంగ్యూ దినోత్సవాన్నీ జయప్రదం చేయండి
జయజయహే : గత కొన్నేళ్లుగా దేశంలో డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఏటా మే 16న జాతీయ డెంగి దినోత్సవం జరుపుకుంటున్నామని అల్లూరి జిల్లా ఏఎంఓ సత్యనారాయణ అన్నారు.గురువారం అరకులోయలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో లవరాజు ఈఓపిఆర్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 పంచాయతీల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఆయన మాట్లాడుతూ..ఈనెల 16న ప్రతి పంచాయితీలో డెంగి నివారణ అవగాహన దినోత్సవం నిర్వహించాలన్నారు.ఇది చాలా ప్రాణాపాయంతో కూడుకున్న వెక్టర్ వల్ల సంక్రమించే...