Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీదామోదర్ సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు సేవలు భేష్....

దామోదర్ సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు సేవలు భేష్….

శ్రీకాకుళం : జయజయహే : దేశ రాజకీయాల్లో తొలితరం నేతల్లో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నేతల్లో మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఒకరని.. అట్లాంటి మహనీయుని పేరట శ్రీకాకుళం లో ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న కీర్తి శేషులు ఎస్ ఆర్ గంజి కుమారుడు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా ధన్యులు అని వక్తలు కొనియాడారు.. గురువారం శ్రీకాకుళం నగరంలో ద్వారకా నగర్ కాలనీ ఉన్న ఖ్యాతి ఫౌండేషన్ ఆవరణలో కీర్తి శేషులు ఎస్ ఆర్ గంజి… మరియు ఎస్. సంజీవయ్య ల నాల్గవ వర్ధంతి వేడుకలు శ్రీ దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ మాట్లాడుతూ.. దళిత హక్కుల పరిరక్షణ కోసం ఎస్ ఆర్ గంజి కుటుంబం అంకిత భావంతో పనిచేస్తూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆదరాభిమానాలు సంపాదించింది అని అన్నారు. తొలితరం కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసికొని రాష్ట్రంలో దళిత హక్కుల పరిరక్షణ కు పాటుపడే నేతల్లో ఎస్ ఆర్ గంజి ఒకరని కొనియాడారు.. ఎస్ ఆర్ గంజి రెండవ కుమారుడు గంజి సంజీవయ్య కోవిడ్ లో మరణించిన తర్వాత ఏటా ఆయన పేరుతో సంస్మరణ సభ ఏర్పాటు చేసి అనాధులకు.. అన్నార్తులకు బాసటగా నిలిచే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా సేవలు మరువలేనివి అని కొనియాడారు.. కీర్తి శేషులు ఎస్ ఆర్ గంజి.. మరియు గంజి సంజీవయ్య ల పేరట ఒక అవార్డ్ ఏర్పాటు చేసి ప్రతీ ఏటా వారి సంస్మరణ సభ రోజు ఉత్తమ సామాజిక సేవకులకు అందిస్తే బాగుంటుందని దళిత సంఘాల సమాఖ్య నేత.. నూతులపాటి భరత్ భూషణ్ సూచించారు. సంజీవయ్య ట్రస్టు పేరుతో చేస్తున్న సేవలు భేష్ అంటూ జర్నలిస్టుల ఐక్య వేదిక కన్వీనర్ శాసఫు జోగినాయుడు… రాష్ట్ర ఎస్ సి.. ఎస్ టి ఉపాధ్యాయ సంఘాల నేత పోతల దుర్గారావు… జాఫ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు జి. షన్ముఖరావ్లు అంపొలు ప్రతాపు లు అన్నారు. అంతకన్నా ముందు ఖ్యాతి ఫౌండేషన్ లో ఉన్న అనాధులకు అన్నదానం.. వస్త్రదానం అతిథుల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు… దళిత సంఘాల నేతలు పి అప్పన్న,బి వేణుగోపాల్ రావు,కె అనీ రోజ్ ,కె ఎన్ మూర్తి,ఆర్ పి రావు ,గొల్లపల్లి నందేష్ పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?