Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీమైనార్టీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి

మైనార్టీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి

మాడుగుల : జయజయహే : మాడుగుల మండలంలో మైనార్టీలను క్రిస్టియన్లు ముస్లింలు, సిక్కులు బౌద్ధులు , జైన్ లు తదితరులు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కో ఆప్షన్ మెంబర్ షేక్ ఉన్నిషా విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా తమ దరఖాస్తులను ఏ.పీ. ఓ.బి. ఎం.ఎం.ఎస్. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముస్లిం మైనార్టీ వారు బీసీ ఈ క్యాటగిరి లోను, ఇతర మైనార్టీలైన సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సికులు ఓసి క్యాటగిరి లోను, క్రిస్టియన్లు బీసీ.సీ క్యాటగిరి లోను, ఇతర క్రిస్టియన్లు ఓసి క్యాటగిరి లోను నమోదు చేసుకోవాలన్నారు.50 శాతం సబ్సిడీపై అందిస్తున్న ఈ రుణాలలో లక్ష రూపాయల రుణం పొందిన వారికి 50,000, మూడు లక్షల వరకు రుణం పొందిన వారికి లక్షా పాతికవేలు, మూడు నుంచి ఐదు లక్షలు రుణం పొందిన వారికి 300000, ఎనిమిది లక్షల రుణం పొందిన వారికి నాలుగు లక్షల చొప్పున సబ్సిడీ అందించబడునని తెలిపారు. మాడుగుల మండలానికి సంబంధించి ఇండియన్ బ్యాంక్ వారు లక్ష రూపాయల యూనిట్ గల ఒక లోను, యూనియన్ బ్యాంక్ వారు లక్ష రూపాయలు విలువ గల ఒక యూనిట్, మూడు లక్షల విలువ గల ఒక యూనిట్ మంజూరు చేస్తారని తెలిపారు. కాబట్టి ఈ అవకాశాన్ని మైనారిటీలు సద్వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?